కొరిమెర్ల (పామర్రు)MEel M34 u89T9um12HhOy NIxh067Qq0 F Qq
కొరిమెర్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521157 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
కొరిమెర్ల , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.
విషయ సూచిక
- 1 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- 2 గ్రామ భౌగోళికం
- 3 సమీప గ్రామాలు
- 4 సమీప మండలాలు
- 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు
- 6 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 7 గ్రామ విశేషాలు
- 8 మూలాలు
- 9 బయటి లింకులు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2015,సెప్టెంబరు-24వ తేదీ గురువారం ఉదయం ఆరు గంటలకు, సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకినవి. [3]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి
సమీప మండలాలు[మార్చు]
పమిడిముక్కల, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, మొవ్వ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
అరుణోదయ హైస్కూల్, పామర్రు ఉషోదయ హైస్కూల్, పసుమర్రు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ సూరపనేని మోహన్ దాస్ కరంచంద్, ఒక మాజీ సర్పంచ్. వీరి కుమారుడు రామకృష్ణ, హైదరాబాదులో ఒక వ్యాపారవేత్త. వీరు తన స్వంతగ్రామంపై మమకారంతో, ఈ గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (Smart villege) గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో, ఫిబ్రవరి-2015లో, దత్తత తీసుకున్నారు. మూడు నెలలు తిరగకముందే, అన్ని గ్రామాలకంటే ముందుగా గ్రామంలో విద్యుత్తును ఆదాచేయాలనే ఉద్దేశంతో, మొత్తం 70 విద్యుత్తు స్తంభాలకు, ఎల్.ఇ.డి. దీపాలను అమర్చారు. ఇంకా స్థానిక ఏ.ఎన్.కే.రహదారి ప్రక్కన 8 ఎకరాలలో విస్తరించియున్న ఊరచెరువు అభివృద్ధి, గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి, ఇళ్ళు లేనివారికి పక్కా ఇళ్ళ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు, మూడు సంవత్సరాలలో తమ గ్రామం ఒక చిన్నపాటి బస్తీలాగా అభివృద్ధిచెందగలదని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [1] ఈ గ్రామములోని మొత్తం 200 నివాసగృహాలలోనూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకొని, ఈ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. [2]
మూలాలు[మార్చు]
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
బయటి లింకులు[మార్చు]
- http://manapamarru.blogspot.com/2010/03/korimerla.html
[1] ఈనాడు అమరావతి; 2015,మే-19; 39వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-15; 28వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-24; 17వపేజీ.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Korimerla". Retrieved 29 June 2016. External link in
|title=
(help)